మావోయిస్టుల చెర నుంచి ఎట్టకేలకు వినీల్ కృష్ణ విడుదల

హోంశాఖ కార్యదర్శి ఉపేంద్రనాథ్ బెహరా సమక్షంలో మంగళవారం రాత్రి హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల 14 షరతులకు ఒరిస్సా ప్రభుత్వం అంగీకరించడంతో చర్చలు ముగిశాయని ప్రకటించారు. గంటి ప్రసాదం, పద్మ, ఈశ్వరి, సరిత, కులదీపియాలపై 2001, డిసెంబర్ 13న సిమిలిగుడ ఠాణాలో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. నారాయణపట్నలో సీతన్న గల్లంతుపై దర్యాప్తు చేస్తారన్నారు. మావోయిస్టులు ఎటువంటి విధ్వంసానికి పాల్పడనంత వరకు పోలీసులు కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరని పేర్కొన్నారు.
బలిమెల బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని, నారాయణపట్న సంఘటనలో అరెస్టయిన నేతల సమస్యలను పరిష్కరిస్తారని వెల్లడించారు. భద్రతా బలగాలు మావోయిస్టులపై బలప్రయోగం చేయవని చెప్పారు. సుమారు 600 మందికి పైగా ఖైదీలను విడిచి పెట్టాలన్న డిమాండుకు సంబంధించి ప్రభుత్వం 15 రోజుల్లో ప్రక్రియ ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేస్తుందని హరగోపాల్ చెప్పారు. మావోయిస్టు శ్రీరాములు శ్రీనివాస్‌కు ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసు విచారణలో ఉండటంతో ఆయన విడుదల కాలేకపోయారు.












Click it and Unblock the Notifications