తెరాస ఎమ్మెల్యేలతో పయ్యావుల భేటీ, బడ్జెట్ ప్రసంగం బహిష్కరణ

శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని ప్రతిపాదించాలని తెలుగుదేశం సీమాంధ్ర శానససభ్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిపై తెరాస సహకారం కోరడానికి ఆయన ఆ పార్టీ శాసనసభ్యులతో సమావేశమైనట్లు సమాచారం. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ సమస్యపై శాసనసభ సమావేశాలు అట్టుడుకుతూనే ఉన్నాయి. సభా కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. బుధవారం కూడా తెలంగాణపై తెరాస సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఆందోళనకు దిగడంతో శాసనసభ మూడు సార్లు వాయిదా పడింది. ఈ స్థితిలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, శైలజానాథ్, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టివిక్రమార్క సమావేశమయ్యారు.