వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గద్దర్ పాటకు చిందేసిన ఓరుగల్లు: లక్ష నినాదాలు-లక్ష నివాళులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
వరంగల్: జిల్లాలో లక్షకుపైగా తెలంగాణవాదులు ఏకమై జై తెలంగాణ అంటూ బుధవారం నినదించారు. తెలంగాణకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లక్ష నినాదాలు-లక్ష నివాళులు పేరుతో వరంగల్ జిల్లాలో లక్షమందితో తెలంగాణవాదులు భారీగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు పార్టీలతో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. లక్షకుపైగా ఇందులో తెలంగాణవాదులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ రాసిన వీర తెలంగాణమా అనే పాటకు పలువురు తెలంగాణవాదులు చిందులు వేశారు. అయితే ర్యాలీ తీస్తున్న తెలంగాణవాదులపై పోలీసులు అడ్డుకున్నారు. అయితే తెలంగాణవాదులు ర్యాలీని ఎంతకు విరమించుకోక పోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

కాగా కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన 48 గంటల పిలుపులో భాగంగా రెండోరోజు నిర్వహిస్తున్న బంద్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.

English summary
About one lack Telanganites rallied in Warangal today. Telanganites organized Laksha Ninadalu-Laksha Nivalulu programme. Police lathi charged on Telanganites denying permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X