రాజీనామా లేఖలతో ఢిల్లీకి కాంగ్రెసు తెలంగాణ శానసభ్యులు

కాగా, ఈ లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, తెలంగాణ కోసం రాష్ట్ర శాసనసభ సమావేశాలను అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాససనభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతో పోటీ పడాలని కూడా వారు అనుకుంటున్నారు. సోమవారం నుంచి వారు రాష్ట్ర శాసనసభ సమావేశాలను అడ్డుకునే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి.
కాగా, తెలంగాణపై మార్చిలో శుభవార్త వస్తుందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం, తెరాస నాయకులను కూడా సంప్రదించిందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం కాబోతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications