హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి, జెసి రాజీనామాలతోనే అనిశ్చితి: టిడిపి ఎమ్మెల్యే కొత్తకోట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించి డిసెంబర్ 23న మళ్లీ వెనక్కి తగ్గడానికి కారణం సీమాంధ్ర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆరోపించారు. డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిన తర్వాత విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి, అనంతపురం ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డిలు రాజీనామాలకు తెర దీశారని అన్నారు. ఆ తర్వాతే రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొంద్న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసు పార్టీ అని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందన్నారు.

తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్నారు. అయితే తమ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న దృష్ట్యా తాము తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని కూడా రక్షించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. ప్రజలతో మమేకమైన టిడిపిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. ప్రజలు కాంగ్రెసు‌కు అధికారం ఇచ్చారు. మరి నిర్ణయాలపై యూటర్న్ తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.

కాగా ప్రజా సమస్యలనుండి తప్పుకోవడానికే ప్రభుత్వం సమావేశాలను పలుమార్లు వాయిదా వేస్తుందని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సభ నిర్వహణ సక్రమంగా జరగడం లేదన్నారు. బడ్జెట్ పైన కూడా సజావుగా చర్చించడానికి వీలు లేకుండా పోతోందన్నారు.

English summary
Telugudesam Party MLA Kothakota Prakash Reddy blamed Vijayawada MP Lagadapati Rajagopal and Ex Minster JC Diwakar Reddy for Congress U turn on separate Telangana. He said they are trying to TDP survival in Two places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X