హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివనామ స్మరణలో అపశృతి, ఒకరి మృతి: భక్తులతో ఆలయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srikalahasti
హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రాకతో శివాలయాలు శివ నామస్మరణంతో మారు మ్రోగుతున్నాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ, శ్రీకాళహస్తి వంటి పవిత్ర శివ పుణ్యక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు నదీ జలాల్లో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. శివాలయాలలో పలువురు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.కాగా శ్రీకాళహస్తి క్షేత్రంలో శివుడు ఎలాంటి ముస్తాబు లేకుండానే భక్తుల మొక్కులు అందుకుంటున్నారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఉన్న ఈవో కొత్త ఈవోకు తాళాలు అప్పగించక పోవడం వల్లనే ఇది జరిగిందని అధికారులు అంటున్నారు.

అయితే బుధవారం తాళాలు రావచ్చునని అధికారులు అంటున్నారు. వేములవాడల రాజన్నస్వామికి టిడిడి ఆలయ ఈవో కృష్ణారావు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోటలో కృష్ణా నదిలో పుణ్యస్నానం చేస్తూ ఫణీంద్ర అనే యువకుడు మృతి చెందాడు. ఆయనకు 18 సంవత్సరాలు ఉంటాయి.

English summary
All the temples of Siva filled with devotees today. Siva god is getting devotees prayers in Srikalahasti without hornments. One dead in Kakinada while bathing in river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X