వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్\రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో తెలుగుదేశం పార్టీ విలీనం అవుతుందని చెప్పారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని జగన్ చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వంద రోజుల పాలన పూర్తిగా దుష్పరిపాలన అన్నారు.

మాట తప్పడం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంశంలో లేదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని, ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన జగన్ అదే మాటకు కట్టుబడి ఉన్నారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభిమానులందరికీ ఆయన మద్దతు ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన జగన్‌పై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ర్పచారాన్ని జూపూడి ఖండించారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp leader Ambati Rambabu alleged that TDP and Congress are go with understand in MLC elections to fight against Jagan. He blamed CM Kirankumar Reddy hundred days ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X