కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు: ఎస్పీ అధినేత ములాయం
National
oi-Srinivas G
By Srinivas
|
లక్నో: యూపిఎ ప్రభుత్వం నుండి తమిళనాడుకు చెందిన డిఎంకె పార్టీ తప్పుకొని, ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో చేరుతుందన్న వాదనల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ ఆదివారం లక్నోలో మీడియ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సమావేశంలో ములాయం ఆచితూచి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోరితే కేంద్రానికి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. అయితే యూపిఎ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సమస్య లేదని చెప్పారు. డిఎంకె, కాంగ్రెస్ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి సంక్షోభం ఉండదన్నారు.
కాంగ్రెస్ నుండి ప్రతిపాదన రాలేదని చెప్పడంతో ఆయన కేవలం కాంగ్రెస్ ప్రతిపాదన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థన వస్తే పరీశీలిస్తామని మాత్రం చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ కార్యకర్తలపై మాయావతి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మా పార్టీ ఆందోళనలతో బిఎస్పీ వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు.
Samajwadi Party chief Mulayam Singh Yadav on Sunday said "as of now" there was no threat to the Congress-led UPA
government after the DMK announced pullout of support.
Story first published: Sunday, March 6, 2011, 14:08 [IST]