ఆర్థిక పరిస్థితికి ఆందోళనలే కారణం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
Districts
oi-Srinivas G
By Srinivas
|
రాజమండ్రి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితికు అల్లర్లు, ఆందోళనలే ముఖ్య కారణమని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదివారం రాజమండ్రిలో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అయితే దీనిని ఇప్పటికిప్పుడు మార్చడం ఎవరి వల్ల కాదన్నారు. పరిస్థితిని ఎవరూ మార్చలేరని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్న ఇది తప్పేది కాదన్నారు. ఉద్యమాలు ఆగితే కానీ రాష్ట్ర పరిస్థితి మెరుగయ్యే పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రాష్ట్రానికి ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా పెద్ద పీట వేయలేదని అన్నారు. అయితే త్వరలో రాష్ట్రానికి కాంగ్రెస్ అధిష్టానం మంచి అవకాశాలు ఇస్తుందన్నారు. సిడబ్లుసిలో త్వరలో రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Former CM Konijeti Rosaiah said today at Rajahmundry that the agitations were cause for state financial position. He
said no body can stop this type of situation. He hoped that AP will get justice in CWC soon.
Story first published: Sunday, March 6, 2011, 11:32 [IST]