ఎమ్మెల్సీ ఎన్నికలు: చంద్రబాబు చిక్కుముడి, రంగంలో సిపిఐ అభ్యర్థి

Chandrababu Naidu
హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిక్కుముడి వేశారు. మిత్రపక్షాల తరఫున నాలుగో అభ్యర్థిని నిలపాలని ఆయన నిర్ణయించారు. దీంతో రహస్య ఓటింగ్ అనివార్యం కానుంది. కాంగ్రెస్‌ తరఫున నలుగురు, ప్రజారాజ్యం, మజ్లిస్‌, తెరాస, సీపీఐల నుంచి ఒక్కరేసి, తెలుగుదేశం నుంచి ముగ్గురు రంగంలోకి దిగుతున్నారు. దీంతో మొత్తం 10 స్థానాలకు 11 మంది పోటీ పడుతున్నట్లయింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం ఖరారు చేశారు. శాసనసభ మాజీ స్పీకరు ప్రతిభా భారతి, కడప జిల్లా పులివెందులకు చెందిన సతీష్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన గంగాధర్‌ గౌడ్‌లను చంద్రబాబు ఎంపిక చేశారు. ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించారు. ఎ

తమ పార్టీ అభ్యర్థులు ముగ్గురు, సీపీఐ అభ్యర్థినీ గెలిపించుకునే విధంగా వ్యూహం రూపొందించామని తెదేపా నేతలు చెబుతున్నారు. తెదేపాకు మొత్తం 89 మంది ఎమ్మెల్యేలున్నారు. సీపీఐకి నలుగురు, సీపీఎంకు ఒకరున్నారు. మొత్తంగా మిత్రపక్షాల బలం 94. తెరాసకు 12 మంది ఎమ్మెల్యేల బలమే ఉందని, తమ అభ్యర్థుల్లో సతీష్‌రెడ్డికి 28 పోను... మిగతా ముగ్గురు అభ్యర్థులకు 22 చొప్పున ఓట్లు ఉంటాయని, దీంతో నలుగురూ గెలుస్తారని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ తన ఓటును సీపీఐకి వేస్తారని సమాచారం. దీంతో సీపీఐ అభ్యర్థికి 23 ఓట్లు వస్తాయి. తద్వారా సిపిఐ అభ్యర్థికి మరో ఓటు ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన డిమాండ్ అంశంపై తెరాస వైపు ఉంటుందని భావించిన సిపిఐ తెలుగుదేశం వైపు మళ్లింది. అయితే, కాంగ్రెసు ఐదో అభ్యర్థిని నిలబెడుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులను, తమ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులను సులభంగా గెలుచుకునే బలం కాంగ్రెసుకు ఉంది. అయితే వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు క్రాస్ ఓటింగుకు పాల్పడితే తెరాస అభ్యర్థితో పాటు సిపిఐ అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+