హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరును అడ్డుకున్న తెలంగాణవాదులు: విధ్వంసాన్ని ఖండించిన చిరు, బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవిని పలువురు తెలంగాణవాదులు శుక్రవారం టాంక్‌బండ్ పైన అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురువారం మిలియన్ మార్చ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొందరు ఆందోళనకారులు తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుల విగ్రహాలను కూల్చారు. చిరంజీవి టాంక్‌బండ్ వెళ్లి వాటిని పరిశీంచారు. ఆ సమయంలో పలువురు తెలంగాణవాదులు ఆయనను అడ్డుకొని చిరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహి వెనక్కి వెళ్లు అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణగక పోవడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసి వారిని తరిమి వేశారు.

అనంతరం చిరంజీవి మాట్లాడారు. విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు.ధ్వంసమైన విగ్రహాల స్థానంలో తిరిగి విగ్రహాలను పున ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. విగ్రహాలను తిరిగి ప్రతిష్టకుంటే తామే అందుకు పూనుకుంటామని చెప్పారు. కాగా విగ్రహాల విధ్వంసాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించారు. ఉదయం శాసనసభా కార్యక్రమాలకు వెళుతూ టాంక్‌బండ్ పైన జరిగిని విధ్వంసాన్ని పరిశీలించారు. దాడిని ఆయన ఖండించారు.

English summary
Telanganites obstructed PRP president Chiranjeevi today at tank bund. They gave slogans against Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X