వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో భారతీయుడికి ఉరి శిక్ష, మరో 11 మందికి జీవితఖైదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dubai Criminal Court
దుబాయ్ : తోటి కార్మికుడిని హత్య చేసిన కేసులో ఓ భారత జాతీయుడికి మరణశిక్ష పడింది. మరో 11 మంది భారత జాతీయులకు జీవిత ఖైదు విధించారు. మద్యం మత్తులో 2009లో భారతదేశానికే చెందిన తమ తోటి కార్మికుడిని చిత్రహింసలు పెట్టి, హత్య చేశారని వారిపై అభియోగాలు మోపారు. పంజాబ్‌కు చెందిన మేజర్ సింగ్ అనే వ్యక్తికి మరణశిక్ష పడగా, మరో 11 మందికి జీవిత ఖైదు పడింది.

ఈ కేసులో ఓ పాకిస్తాన్ జాతీయుడికి కూడా జీవిత ఖైదు పడింది. హత్యకు గురైన వ్యక్తి కేరళకు చెందినవాడు. అయితే, అతని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. భారతీయుల తరఫున కేసు చూస్తున్న ఒబెరాయ్ వారికి శిక్ష పడిన విషయాన్ని ధ్రువీకరించారు. సుఖ్‌జీత్ సింగ్, రాకేష్ కుమార్, సుఖ్‌విందీర్ సింగ్, సుర్జీత్ సింగ్, మంజిత్ సింగ్, రాశ్పాల్ సింగ్, బల్విందర్ సింగ్, అమర్జిత్ సింగ్, సురీందర్ సింగ్, బల్వీందర్ సింగ్, సరబ్జిత్ సింగ్ అనే భారతీయులకు, మొహమ్మద్ రాఫత్ అనే పాకిస్తానీకి జీవిత ఖైదు పడింది.

English summary
An Indian national was sentenced to death and 11 others were given life imprisonment for torturing and killing a compatriot here. Major Singh, from Punjab, was awarded death penalty and 11 others have been given life imprisonment after they were found guilty of murdering a co-Indian worker after a drunken brawl in 2009. A Pakistani man was also sentenced to life imprisonment in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X