చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం, రూ.1.40 కోట్లతో పరారీ
Districts
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన హైదరాబాదులో జరిగింది. ఝాన్సీ అనే మహిళ 1 కోటీ 40 లక్షల రూపాయలకు టోకరా వేసి పారిపోయింది. హైదరాబాదులోని రాజేంద్రనగర్ పరిధిలో గల భవానీ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పదేళ్ల క్రితం సుబ్రహ్మణ్యం, ఝాన్సీ దంపతులు గుంటూరు నుంచి హైదరాబాదు వచ్చారు. సుబ్రహ్మణ్యం ప్రభుత్వోద్యోగం చేస్తుండగా, ఝాన్సీ చిట్టీలు వేయడం ప్రారంభించింది.
దాదాపు 60 మంది మహిళల నుంచి చిట్టీల పేరుతో కోటీ 40 లక్షల రూపాయలు వసూలు చేసి కనిపించకుండా పోయింది. దాంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుబ్రహ్మణ్యానికి వరంగల్ బదిలీ అయింది. వారిద్దరు వరంగల్ వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.