నేను సన్యాసిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను: బాబా రాందేవ్

Baba Ramdev
కరీంనగర్: తాను సన్యాసిని అని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మంగళవారం కరీంనగర్‌లో అన్నారు. తాను రాజకీయ పార్టీ స్థాపించినప్పటికీ రాజకీయాల్లో తాను ఉండనని వెనుక ఉండి నడిపిస్తానని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో సజ్జనులనే పార్లమెంటుకు పంపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. పరోక్ష రాజకీయాల్లో మాత్రం ఉంటానని అన్నారు. నీతివంతులను చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉందన్నారు.

అవినీతి, అత్యాచారాలను రూపుమాపడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. దేశంలో అవినీతి పెరిగి పోయిందన్నారు. బ్లాక్ మనీని వెనక్కి తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలతో అవినీతి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎంతో ఆవశ్యమని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై ఇరు ప్రాంతాలు సుముఖంగా ఉన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+