వైయస్ జగన్‌కు రెండు ఐటి నోటీసులు: ఆలస్యంగా వెలుగులోకి
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపన్ను శాఖ రెండు ఐటి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసులు ఐటి శాఖ గతంలోనే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సాక్షి పత్రిక జగతి సంస్థ ద్వారా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే జగతి పబ్లికేషన్‌లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై సంపూర్ణంగా వివరణ ఇవ్వాలని ఐటి శాఖ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
అంతేకాకుండా మరో నోటీసులో జగతి పబ్లికేషన్స్‌పై భారీ పెనాల్టీ ఎందుకు వేయరాదో చెప్పాలని ప్రశ్నించింది. పెనాల్టీ, పెట్టుబడులపై వివరణ కోసం ఈ రెండు నోటీసులు ఐటి శాఖ జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.