కోదండరామ్‌పై మల్లుభట్టి ఫైర్, జయసుధ ఇష్యూపై వివరణ

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరి వేస్తామని చెప్పిన కెసిఆర్ లాంటి వారిని చాలామందిని చూశామన్నారు. అలాంటి వారి పార్టీలు అన్నీ కాలగర్భంలో కలిశాయన్నారు. అసెంబ్లీకి పిండ ప్రధానం అన్న కోదండరామ్ వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. కోదండరామ్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దమన్నారు. ఆయనపై అవసరమైన పక్షంలో చర్యలకు వెనకాడమన్నారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విప్‌ను సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ తీసుకోలేదని అనడంలో వాస్తవం లేదన్నారు. ఆమె విప్ పాటించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జయసుధతో తాను మాట్లాడినట్టు చెప్పారు. విప్‌ను పాటిస్తానని ఆమె తనకు స్పష్టం చేసిందన్నారు. విప్ తీసుకోలేదన్నది కేవలం అపోహ మాత్రమే అన్నారు. సమాచార లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. ఆమె అనంతరం వివరణ ఇచ్చుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్ పాటించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications