చర్చ జరగకుండా ఉండడానికే వాయిదాలు: టిడిపి ఎమ్మెల్యేలు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పలు సమస్యల పైన చర్చ జరగకుండా సమావేశాలను వాయిదా వేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంగళవారం ఆరోపించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కృష్ణా ట్రిబ్యునల్‌పై చర్చ జరగకుండానే అసెంబ్లీని ఈ రోజు వాయిదా వేశారని ఆరోపించారు. సమస్యలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే నాదెండ్ల సమావేశాలను తరుచూ వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.
చేనేత రంగంపై కూడా చర్చ జరగకుండా ఎలాగైతే సమావేశాలను వాయిదా వేసుకుంటూ వెళ్లిందో ఇప్పుడూ అలాగే చేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ప్రభుత్వం అసమర్థ న్యాయవాదులను ఉంచి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాగా పలువురు శాసనసభ్యులు తెలంగాణపై చర్చించాలని కూడా పట్టుబట్టారు.