వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌తో తెలుగుదేశం ఎంపి రమేష్ రాథోడ్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌తో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ సమావేశమయ్యారు. ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఆయన మంగళవారంనాడు వైయస్ జగన్‌ను కలిశారు. తన కుమారుడి పెళ్లికి వైయస్ జగన్‌ను ఆహ్వానించడానికే తాను వచ్చానని రమేష్ రాథోడ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

పార్లమెంటు సభ్యులుగా కలిసి పని చేసిన సాన్నిహిత్యం కారణంగానే తాను వైయస్ జగన్ వద్దకు వచ్చి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. జగన్‌తో ఏ విధమైన రాజకీయ చర్చలూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. అయితే, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికే రమేష్ రాథోడ్ వచ్చారని కచ్చితంగా చెప్పలేని స్థితే ఉంది.

English summary
TDP MP Ramesh Rathore met YSR Congress leader YS Jagan today. Ramesh Rathore clarified that he has come to YS Jagan to his son's marraige. He said that no political discussion was took place between them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X