కాంగ్రెస్ వారి లక్ష్యం: జగన్ వర్గం ఎమ్మెల్యేలపై సిఎం కిరణ్ దాడి

ఎన్నికకు ముందు జగన్ వర్గం ఎమ్మెల్యేలను ముగ్గురు, నలుగురిని మినహాయించి అందరినీ పిలిచి అడిగానని, వారంతా కాంగ్రెసు అభ్యర్థికే ఓటు వేస్తామని చెప్పారని అన్నారు. అయితే తర్వాత వారి తీరు కాంగ్రెసు ఓటమే అభిమతంగా కనిపిస్తోందన్నారు. కడప ఎన్నికల ప్రచారానికి జానీ వెళతారని చెప్పారు. శాసనమండలి ఎన్నికలు రాజ్యసభలా ఉంటే బావుంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈసీ దీనిపై పరిశీలన చేయాలని సూచించారు.
పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసిన విషయంపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. గెలిచిన అభ్యర్థులు పార్టీకి కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ చెప్పినట్టే నడుచుకోవాలన్నారు. కాంగ్రెసు నుండి 10 నుండి 12 ఓట్లు క్రాస్ అయ్యాయని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు తమకు ఓటు వేసిన విషయం తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications