వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా డైరెక్టర్‌గా ముఖేష్‌ అంబానీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ దీరూభాయ్‌ అంబానీ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కార్పొరేషన్‌ బోర్డు డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ముఖేష్‌ను బోర్డులోకి తీసుకున్నట్టు బ్యాంక్‌ చైర్మన్‌ చార్లెస్‌ ఓ హాలిడే వివరించారు. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, వ్యూహాత్మక ప్రణాళికలు, వివిధ విభాగాలకు సేవల విస్తరణ తదితర విషయాలపై ముఖేష్‌కు ఉన్న పట్టు బ్యాంకు వాటాదారులకు లాభాలను తెచ్చి పెడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎనర్జీ, ఐటి, రిటైల్‌ విభాగాలకు బ్యాంకు సేవలు చేరువ కావాలంటే ముఖేష్‌ అంబానీ వంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాగా, ఈ ఆఫర్‌ తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అంబానీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులో తొలి నాన్‌ అమెరికన్‌ సిటిజన్‌గా డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరిస్తుండడం సవాలేనని ఆయన అన్నారు. తనపై నిలిపిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన అన్నారు.

English summary
Mr Ambani, whose Mumbai- based company owns the world’s largest refining complex, will stand for election at an annual meeting this year, the North Carolina-based bank said on Wednesday. He is the world’s ninth-richest person and the wealthiest person in India, with a net worth estimated at 27bn, according to Forbes magazine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X