పిఎం మన్మోహన్, సిఎం కిరణ్ తల్చుకుంటే తెలంగాణ: బాబా రామ్ దేవ్
Districts
oi-Srinivas G
By Srinivas
|
రంగారెడ్డి: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తల్చుకుంటే ప్రత్యేక తెలంగాణ వస్తుందని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ శనివారం స్వాభిమాన్ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిబిరం కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణపై తొందరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
తెలంగాణ కోరడం ప్రజాస్వామిక హక్కు అని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి రహిత అభ్యర్తులనే బలపరుస్తానని చెప్పారు. అవినీతిరహిత భారత్ తన లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అవినీతి జాడ్యం బాగా పెరిగి పోయిందన్నారు. అవినీతిని నిర్మూలించడమే మన ముందున్న మార్గమని చెప్పారు.