ఇలాంటి ఎన్నికలు నేను ఎన్నడూ చూడలేదు: బిజెపి నేత వెంకయ్య
State
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వంటి ఎన్నికలు తాను ఎన్నడూ చూడలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సోమవారం విజయవాడలో విలేకరులతో అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమై పోయాయని ఆరోపించారు. ఓటర్లను బేరానికి పెట్టి ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆరోపించారు.
పూర్తిగా అవినీతిమయంలో కూరుకు పోయిన యూపిఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. యూపిఏ మొత్తం కుంభకోణాల మయమన్నారు. 2జి స్కాం, కామన్వెల్తు, ఆదర్స్ కుంభకోణం ఇలా పలు కుంభకోణాల్లో చిక్కుకు పోయిందన్నారు. కుంభకోణాలపై విచారణ చేపట్టడానికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందని అన్నారు.