చంద్రబాబు తెలంగాణకు కట్టుబడి ఉన్నారు: ఎర్రబెల్లి దయాకర్ రావు

అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెలంగాణ జెఎసి కింద పోటీ చేయాలని తాను ప్రతిపాదిస్తూ వస్తున్నానని, దీనికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు అంగీకరించాయని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాత్రమే అంగీకరించడం లేదని ఆయన అన్నారు. పార్టీల తరఫున పోటీ చేస్తే స్వార్థం పెరుగుతుందని, పార్టీరహితంగా పోటీ చేయడం వల్ల ఆ స్వార్థం ఉండదని ఆయన అన్నారు. అప్పుడే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. పార్టీల తరఫున పోటీ చేస్తే తమ తమ పార్టీలు పెరగాలని, బలం పుంజుకోవాలని ఉంటుందని, పార్టీరహితంగా పోటీ చేస్తే అటువంటిది ఉండదని ఆయన అన్నారు.