చంద్రబాబుపై విరుచుకుపడిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసససభ్యులు విరుచుకుపడ్డారు. వారు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు భూకేటాయింపుల వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. జగన్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఈ ఆరోపణలు చేసేవారు కాదని ఆమె అన్నారు. జగన్‌ను చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని, అందుకే కుయుక్తులు పన్నుతున్నారని ఆమె అన్నారు.
తాము విచారణకు భయపడడం లేదని, అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరగాలని ఆమె అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ కేటాయింపులు ప్రారంభించారని ఆమె అన్నారు. రహేజా విషయంలో ప్రభుత్వానికి నష్టం కలిగేలా చేసింది చంద్రబాబు నాయుడేనని ఆమె విమర్శించారు. రిలయన్స్ గ్యాస్ ద్వారా రాష్ట్రం లాభపడకుండా చేసి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావుకు లాభం చేకూరేలా చంద్రబాబు వ్యవహరించారని, చంద్రబాబు ఉదారత కారణంగానే రిలయన్స్ రామోజీ సంస్థలో పెట్టుబడులు పెట్టారని ఆమె అన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై, రామోజీ ఫిల్మ్ సిటీలపై కూడా విచారణ జరగాలని ఆమె అన్నారు.
YS Jagan camp MLA Shobha Nagireddy lashed out at TDP president N Chandrababu Naidu on land allocation issue. She said that Chandrababu is afraid of YS Jagan politics.
Story first published: Saturday, March 26, 2011, 14:50 [IST]