విశాఖ రైల్వే జోన్: కేంద్రం కీలక గెజిట్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' (SCoR) కార్యరూపం దాల్చింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే మ్యాప్‌లో విశాఖకు దక్కిన ఈ గుర్తింపు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త వేగాన్ని ఇవ్వనుంది.

నూతనంగా ఏర్పాటవుతున్న ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలోని కొన్ని ముఖ్యమైన సెక్షన్లను విడదీసి ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. గతంలో రాయగడ డివిజన్‌లో ఉన్న పలు రైల్వే లైన్లను ఇప్పుడు విశాఖ డివిజన్‌లో విలీనం చేశారు.

Visakhapatnam Railway Zone Gazette Released South Coast Railway Operations to Begin Officially From June 1

ముఖ్యమైన లైన్లు: పలాస-ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం-దువ్వాడ-విజయనగరం లైన్లు ఇప్పుడు విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చాయి.

విలీనమైన రూట్లు: నౌపడా-పర్లాకిమిడి, బొబ్బిలి-సాలూరు, సింహాచలం-వడ్లపూడి-జగ్గయ్యపాలెం లైన్లు కూడా ఇకపై విశాఖ నుంచే పర్యవేక్షించబడతాయి.

ఉమ్మడి కేటాయింపు: అత్యంత కీలకమైన కోరాపుట్-కిరండోల్ లైన్‌ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించడం విశేషం.

రైల్వే స్టేషన్‌లో ఇక 'భోలు' సాయం. దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆవిష్కరణ..
రైల్వే స్టేషన్‌లో ఇక 'భోలు' సాయం. దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆవిష్కరణ..

శరవేగంగా ఏర్పాట్లు.. ఆరిలోవలో శాశ్వత భవనం

జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రైల్వే యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని ఆరిలోవలో జోనల్ కార్యాలయం కోసం శాశ్వత భవన నిర్మాణం చేపట్టనుండగా, ప్రస్తుతానికి వీఎంఆర్‌డీఏ (VMRDA) డెక్‌లోని రెండు అంతస్తుల్లో జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేశారు. 2025 జనవరిలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే.

కొలువుదీరుతున్న అధికారులు.. ఉద్యోగుల ఆసక్తి..

జోన్ నిర్వహణకు కావాల్సిన కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. జోన్ మొత్తం మీద సుమారు 17 వేల మంది సిబ్బంది అవసరం కాగా, విశాఖ జీఎం కార్యాలయంలో పనిచేసేందుకు ఇతర డివిజన్ల నుంచి సుమారు 3 వేల మంది ఆసక్తి వ్యక్తం చేయడం విశేషం.

మరో కొత్త అమృత్ భారత్ రైలు.. తక్కువ ఖర్చుతో ఈశాన్య భారత్ ప్రయాణం
మరో కొత్త అమృత్ భారత్ రైలు.. తక్కువ ఖర్చుతో ఈశాన్య భారత్ ప్రయాణం

చారిత్రక నేపథ్యం..

2019 ఫిబ్రవరిలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. కొంతకాలం సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగినప్పటికీ, 2025 జనవరిలో డీపీఆర్‌కు (DPR) ఆమోదం లభించడంతో ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా రావడంతో ఉత్తరాంధ్రలో పండగ వాతావరణం నెలకొంది. ఈ జోన్ ఏర్పాటుతో విశాఖకు కొత్త రైళ్లు, రైల్వే మౌలిక సదుపాయాలు మరియు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+