సంక్రాంతి 2027 బరిలో మెగాస్టార్ చిరంజీవి- బాబీ సినిమా.. మామూలు విధ్వంసం కాదు..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. సినిమా హిట్.. ప్లాఫ్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు" మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాక రీజినల్ ఇండస్ట్రీ హిట్ గానూ ఈ మూవీ అనేక రికార్డులు సాధించింది. ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ కదిరి లేదా కాకా అని సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా చిరు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయితే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఈ మూవీలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చిరంజీవి విశ్వంభర అనే చిత్రం కూడా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications