చంద్రబాబు నాకు ఆ పని ఇవ్వలేదు, జగన్ పాపాలను చట్టం ముందు నిలబెడతా..

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ రాజకీయాలు ఈ రాష్ట్రానికి ప్రమాదకరమని విమర్శలు గుప్పించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా తాను ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కొంతకాలం పాటు ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా కాలం గడపాలా లేక రాజకీయాల్ని మార్చడానికి జగన్ మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గపు రాజకీయాన్ని మళ్లీ రాష్ట్రం మీద పడకుండా ఉండటానికి మనం ఏమన్నా ప్రయత్నం చేయాలా అనేది తన ముందున్న మార్గాలని.. అందులో తాను ఏపీ రాజకీయాలకు జగన్ ను దూరం చేయడమనే మార్గాన్ని ఎంచుకున్నానని తెలియజేశారు.

ఇంతకంటే గొప్ప పదవి వచ్చి ఉంటే తీసుకునే వారా..?

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కంటే గొప్ప పదవి వచ్చి ఉంటే యాక్సప్ట్ చేసేవారా అని ప్రశ్నించగా.. తాను వేరే పదవి ఆశించానని, తాను కోరుకున్న పదవి గురించి చెప్పానని వివరించారు. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ రానివ్వకుండా.. జగన్ చేసిన తప్పులు, పాపాలు, దుర్మార్గాలు, అక్రమాలు చట్టం ముందు నిలబెట్టే పని ఇవ్వమని అడిగానని స్పష్టం చేశారు. "నీ బొంద నువ్వేం చేస్తావులే అనుకున్నారేమో.." ఆ పని ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తాను పదవి అడగలేదని, పని అడిగానని.. పదవి ముఖ్యం కాదని, పని ముఖ్యమని.. తనుకున్న లిమిటెడ్ లైఫ్ లో పనికి వచ్చే పని చేయాలన్నది తన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఆ పని ఇవ్వనందున తాను బయటకు వచ్చి అదే పని చేస్తున్నానని అన్నారు.

Former IPS AB Venkateswara Rao Hits Out at Jagan Mohan Reddy Reveals Why Chandrababu Rejected Him
పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!
పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!

టీడీపీ కూడా తప్పులు చేస్తుందా..?

వైసీపీ గురించి మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వంపై కూడా ఏబీవీ అసహనం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు తప్పులు చేస్తున్నాయని అందుకనే ఇద్దరిని ఎత్తి చూపిస్తున్నానని తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత సమాజం బాగుపడాలని, రాజకీయాలు బాగుపడాలని చెప్పకొచ్చారు. దానికి రకరకాల మార్గాలున్నాయని. అందుకు టీడీపీలో ఉండి కూడా ఈ పని చేయవచ్చని అన్నారు. లేదా ప్రభుత్వం ఉండైనా.. మరే ఇతర వేదికల నుంచైనా ఈ పని చేయవచ్చని వెల్లడించిన ఏబీవీ.. మొదటి రెండు సఫలం కాలేదని అన్నారు.

జగన్ చేసిందే మీరూ చేయాలా ? చంద్రబాబుకు ఏబీవీ ఘాటు కౌంటర్..!
జగన్ చేసిందే మీరూ చేయాలా ? చంద్రబాబుకు ఏబీవీ ఘాటు కౌంటర్..!

టీడీపీ చేరేందుకు సిద్దమయ్యారా?

టీడీపీలో చేరేందుకు తాను సిద్ధమయ్యానని.. ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని చంద్రబాబుకు చెప్పానన్నారు. అయితే తన పట్ల వారు ఆసక్తి చూపించలేదన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పని అడిగానని.. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం అని, తన లెక్కలో జగన్ విధ్వంసకర రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఏ వ్యవస్థను లెక్క చేయని నైతికత లేనటువంటి రాజకీయాలు రాష్ట్రానికి శాపం అని అన్నారు. జగన్ చేసిన రాజకీయాలు చూసి ఇతరులు నేర్చుకుంటే అధఃపాతాళానికి వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పరోక్ష రాజకీయాలు వద్దని.. ఎమ్మెల్సీ, రాజ్యసభ వద్దని.. చేస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో చేస్తానని తేల్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+