తెలంగాణ ఉద్యమానికి చెక్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ

పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగగొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొన్నది. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి సంతకాలుచేసి బయటకు వెళ్లిపోతున్నారని, అటువంటివారికి పని చేయకపోతే జీతాలు చెల్లించడం కుదరదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.