చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: నాగం, జూపల్లిలకు కేసిఆర్ హెచ్చరిక

K Chandrasekhar Rao
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు తమ తమ పార్టీలకు రాజీనామా చేసి ఉద్యమించాలని అలా చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం మహబూబ్‌నగర్‌లో డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేయనున్న సభను, కాంగ్రెసు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన పాదయాత్రను కెసిఆర్ తప్పుపట్టారు. సమైక్యబాబు ఆదేశాల కారణంగానే నాగం తెలంగాణ సభను వచ్చే నెలలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

జూపల్లి పాదయాత్ర వెనుక కూడా సమైక్యవాదుల కుట్ర ఉందని ఆరోపించారు. జూపల్లి పాదయాత్ర మహబూబ్ నగర్‌లో చేయకుండా రాజ్ భవన్‌కు చేయాలని సూచించారు. వారికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీలకు రాజీనామా చేసి పోరాటం చేయాలని సూచించారు. కాగా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్‌ను పార్టీ నేతలు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని హరీష్ రావు చేసిన ప్రతిపాదనను అందరూ ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+