హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో భవాని మృతి: పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: పదిరోజుల క్రితం హైదరాబాదులో అదృశ్యమైన కృష్ణా నదిలో శవమై తేలిన జీడిమెట్లకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని భవాని అనుమానాస్పద మృతి కేసులో పప్పు, శ్రీకాంత్, శిరీష అనే ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. వీరితో పాటు మరింతమంది సహ విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భవానిని ఎక్కడకు తీసుకు వెళ్లారు, ఎందుకు తీసుకు వెళ్లారు, భవాని ఎలా చనిపోయిందనే విషయాలపై వారి నుండి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వారి సమాధానాలు స్పష్టంగా లేనట్లుగా తెలుస్తోంది. భవాని మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా జీడిమెట్లలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉంటున్న భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని వెళ్లిన భవాని ఆ తర్వాత రోజు కూడా ఇంటికి రాకపోవడంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్‌లో శవంగా కనించింది.

English summary
Police nabbed three students in Bhavani case. Police were investigating that if this is accident or sexual harassment murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X