జూనియర్ ఎన్టీఆర్ ముహూర్తం సమయంలో ఐదువేల పెళ్లిల్లు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: నందమూరి అందాల రాముడు జూనియర్ ఎన్టీఆర్ ముహూర్తం సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదువేలకు పైగా పెళ్లిల్లు జరిగాయని సమాచారం. నందమూరి అందాల చిన్నోడు లక్ష్మీ ప్రణతి మెళ్లో మూడు ముళ్లు వేసిన గురువారం అర్ధరాత్రి 2.41(తెల్లవారితే శుక్రవారం) చాలా మంచి ముహూర్తమంట. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదువేలకు పైగా పెళ్లిల్లు గురువారం జరిగాయని సమాచారం.
కేవలం విశాఖపట్టణం జిల్లాలోనే సుమారు 400 జంటలు, రంగారెడ్డి జిల్లాలు 200కు పాగా జంటలు ఈ శుభముహూర్తంలో ఏకమయ్యాయంట. శుభముహూర్తంతో పాటు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరిగిన సమయంలోనే తమ పెళ్లి జరగటం చాలామందిని ఆనందానికి గురి చేస్తుందంట. ఎవరైనా పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అయినప్పుడే మా పెళ్లయింది అని చెప్పుకోవచ్చు అన్నమాట.