కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో వైయస్ జగన్ గెలిచినట్లే, కాంగ్రెసు నేతల అంచనాలూ అవే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్ విజయం ఖాయమైనట్లే ఉంది. అధికార కాంగ్రెసు పార్టీ నాయకులే వైయస్ జగన్ గెలుస్తారని అంగీకరిస్తున్నారు. కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాత్రమే కాకుండా కాంగ్రెసు కడప అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. ఉప ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛగా జరగలేదని, ఎన్నికల కమిషన్, అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించలేదని, ఇదంతా చూస్తుంటే కడపలో అవినీతే గెలిచేట్టుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మాటలను బట్టి జగన్ గెలుపు ఖాయమైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు జరిగిన తీరును బట్టి చూస్తే అధికారులు జగన్ డబ్బుకు దాసోహమై ఏకపక్షంగా నిర్వహించినట్టు తెలుస్తోందన్నారు.

ఇక లగడపాటి రాజగోపాల్ మాత్రం నేరుగానే జగన్ విజయం సాధిస్తారని చెబుతున్నారు. లగడపాటి సర్వేలు ఇటీవలి కాలంలో కచ్చితంగా ఉంటున్న విషయం తెలిసిందే. కడప ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరోక్షంగా అంగీకరించారు. కడప పార్లమెంటు ఎన్నికలో డబ్బు, పులివెందులలో సానుభూతి గెలుస్తున్నాయని రాజగోపాల్ చెప్పారు. పోలింగ్ సరళిని బట్టి తమకందిన ప్రాథమిక అంచనాల ప్రకారం పార్లమెంటు అభ్యర్థి మెజారిటీ దాదాపు మూడు లేదా నాలుగు లక్షలు ఉండవచ్చన్నారు. ఓటుకు రెండువేల చొప్పున పంచారని ఆరోపించారు. నాయకులకైతే స్థాయిని బట్టి 10 లక్షల నుంచి కోటి వరకు ఇచ్చారని చెప్పారు.

డబ్బు, ప్రలోభాలు ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషించాయని లగడపాటి చెప్పారు. ప్రజల మనోభావాలు తెలుసుకోడానికి తాను వివిధ దశలలో సర్వే చేయించానని, డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండటంతో సర్వే ఫలితాలు సక్రమంగా రాలేదని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని, ఎన్నికల సంఘమే అందుకు బాధ్యత వహించాలని చెప్పారు. ఇందిరమ్మ పాలనను సాగనంపి, ఆర్ఎస్ఎస్ పాలన తేవడం ఎవరివల్లా కాదన్నారు. కడప ఎన్నికలో రెండోస్థానం కాంగ్రెస్, టీడీపీలలో ఎవరిదన్నది అప్పుడే చెప్పలేనన్నారు. పులివెందులలో మాత్రం టీడీపీది మూడోస్థానమేనని లగడపాటి చెప్పారు.

English summary
Congress leaders are assuming YSR Congress candidate YS Jagan will win Kadapa loksabha seat. Congress MP Lagadapati Rajagopal said that YS Jagan will win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X