వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలయ్యాక చేసేదేముంది: కడప ఫలితంపై డిఎస్ నిర్వేదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ: కడప, పులివెందుల ఉప ఎన్నికలు అయిపోయాయని, అయిపోయాక చేసేదేమి ఉందని ఉప పోరు గెలుపుపై ధీమా లేని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సోమావారం నిర్వేదం వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. తెలంగాణ, ఉప ఎన్నికల ఫలితాల తీరు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన డిఎస్ విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల గురించి అడిగినప్పుడు గెలుపుపై ధీమా లేనివిధంగా మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాయని, మే 13న ఫలితాలు తెలిస్తాయి కదా అని అన్నారు.

ఆజాద్‌తో రాజకీయ అంశాలు మాట్లాడినట్టు చెప్పారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు ఇచ్చిన వివరణను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. వాటిని అవసరమైతే అధిష్టానానికి పంపుతామని చెప్పారు. పార్టీ పరంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు కొందరిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తీసుకుంటారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయన్నారు.

English summary
PCC president D Srinivas is not confident on Kadapa win. He was met central minister Gulam Nabi Azad and talk about Telangana and Jagan issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X