వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోటకు బీటలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీదే అధికారం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Benerjee
కోల్‌కతా: వామపక్షాల కోట బీటలు వారుతోంది. 34 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో వామపక్షేతర ప్రభుత్వం ఏర్పడబోతోంది. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ అధికారం చేపట్టనున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. వామపక్షాల ప్రభుత్వాన్ని కూల్చి దీదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మంగళవారం పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తుది పోలింగ్ ముగిసింది. తృణమూల్ - కాంగ్రెసు కూటమికి 210 నుంచి 220 స్థానాలు వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. అధికార వామపక్షాల కూటమి 65 నుంచి 70 స్థానాలకు పరిమితమవుతుందని చెబుతున్నారు. దీంతో మమతా బెనర్జీ కల సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మంగళవారం తుది విడత 83.48 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారంనాడు 14 శాసనసభా స్థానాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగవచ్చునని ఎన్నికల కమిషన్ అధికారులు అంటున్నారు. సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు క్యూల్లో నిలుచున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ఆరు విడతలు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఏప్రిల్ 18వ తేదీన ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన జరుగుతుంది.

English summary
At least 83.48 percent voting was recorded in 14 constituencies that went to the polls Tuesday in the sixth and the last round of the West Bengal assembly elections, an Election Commission (EC) official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X