మోస్ట్ వాంటెడ్‌లో ఎర్రర్: హైదరాబాదీల్లో ఒకరు మృతి, ఒకరు జైల్లో
National
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం అందించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోని తప్పులు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ఇప్పటికే రెండు పేర్లు బయటపడ్డాయి. హైదరాబాదుకు సంబంధించిన టెర్రరిస్టుల విషయంలో కూడా అదే జరిగింది. తప్పులు బయటపడుతుండడంతో సిబిఐ ఆ జాబితాను ఉపసంహరించుకుంది. జైల్లో ఉన్నవారి పేర్లు, మరణించినవారి పేర్లు కూడా పాకిస్తాన్‌కు అందజేసిన జాబితాలో ఉండడం విశేషం.
హైదరాబాదుకు చెందిన షాహిద్ బిలాల్, ఖాజా పేర్లు ఆ విధంగానే చోటు చేసుకున్నాయి. హుజీ సౌత్ ఇండియన్ కమాండర్‌గా భావిస్తున్న షాహిద్ బిలాల్ అనే ఉగ్రవాది రెండేళ్ల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ దాడిలో మరణించాడు. పాకిస్తాన్‌కు పారిపోయిన అతను ఐఎస్ఐ కాల్పుల్లో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, మరో ఉగ్రవాది ఖాజా ప్రస్తుతం హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఇతని పేరు కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది.
Errors in Most wanted list is coming out slowly. Two Hyuderabadis names are in the list. In this two one is dead two years back and another is in jail.
Story first published: Friday, May 20, 2011, 14:24 [IST]