అధికార దుర్వి నియోగం చేసిన నాయకులలో ఎ రాజాది రెండవ స్దానం
National
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
న్యూఢిల్లీ: తమకున్న అధికారాన్ని అతిగా దుర్వి నియోగం చేసిన పదిమంది అగ్ర నాయకుల జాబితా లో టెలికాం మాజీ మంత్రి ఎ రాజా స్థానం సంపాదిం చారు. టైమ్స్ మేగజైన్ విడుదల చేసిన 'ఇగ్నోమి నియస్ క్లబ్ ఆఫ్ ప్రివిలేజ్డ్ లీడర్స్" జాబితాలో ఎ రాజా పేరు కూడా ఉంది. అధికార దుర్వినియోగం కారణం గా జరిగిన పది భారీ కుంభకోణాలలో రాజాకు ప్రమేయముందని భావిస్తున్న 2జి స్కామ్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ నిర్వహించిన 'ప్లంబ ర్స్" మొదటి స్థానంలో ఉంది. పెంటగాన్ పత్రాల్ని లీక్ చేసిన డేనియల్ ఎల్స్‌బర్గ్ పై ఆరా తీయడానికి ప్లంబర్స్ అనే రహస్య యూనిట్‌ను వినియోగించుకున్నారు.
అతిగా అధికార దుర్వి నియోగం చేసిన విశేషాధికా రాలను అనుభవించిన వారి జాబితాను టైమ్స్ పత్రిక రూపొందించేటప్పుడు రాజా గట్టి పోటీని కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తు తం తీహార్ జైల్లో విశ్రాంతి తీసుకొంటున్న రాజాకు టైమ్స్ జాబితాలో రెండో స్థానం అంత సులభంగా రాలేదు. లిబియా నేత ముయమ్మార్ గఢాఫీ, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-2, ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని వంటి వారు రెండోస్థానానికి గట్టి పోటీదారులుగా ఉన్నారు. ఈ సందర్భగా రాజా తరఫు న్యాయవాదిని సంప్రదించినప్పుడు టైమ్స్ నివేదికపై వ్యాఖ్యా నించబోనన్నారు.
Former Indian telecom minister A Raja, at the center of the 2G spectrum allocation scam, has earned the dubious distinction of figuring in Time Magazine's list of "an ignominious club of privileged leaders who stepped too far".
Story first published: Friday, May 20, 2011, 12:17 [IST]