వైయస్ జగన్‌కు చెక్ చెప్పేందుకు తెరపైకి కెవిపి: ఆజాద్ వ్యూహం!

కానీ సిఎం అయ్యాక కిరణ్ చేసిన ప్రకటన మేరకు అందరితో పాటు కేవీపీ కూడా ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. అయినా కాంగ్రెస్ రాజకీయాల్లో కేవీపీ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన తర్వాత మళ్లీ కెవిపి హవా స్పష్టంగా కన్పిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. కెవిపి సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని ఆజాద్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేలలో చాలా మందికి కేవీపీ అంటే గౌరవం ఉంది. దీన్ని ఆజాద్ గ్రహించారని జగన్‌కు చెక్ పెట్టాలంటే కెవిపి సేవలను పార్టీ కోసం సమర్ధంగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం కల్పించే పిసిసి కమిటీలో సభ్యుల్లో కెవిపి ఒకరు. మొత్తానికి ఆజాద్ రాకతో మళ్లీ కాంగ్రెస్‌లో కేవీపీ పాత్ర ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.












Click it and Unblock the Notifications