కడప: కడప జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని రాయచోటి, రామాపురం రహదారి మార్గంలో దర్గా వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
మృతులు రాయచోటి నుండి నీలకంఠాపురం దర్గాకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా రాయచోటిలోని బండ్లపెంట వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.