వెనక్కి తగ్గిన వేణుగోపాలాచారి, పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ

తాను పార్టీ నిర్ణయాలకు లోబడి పని చేస్తానని వేణుగోపాలాచారి చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డితో పాటు నడవడానికి రంగారెడ్డి జిల్లా పరిగి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు జోగు రామన్న కూడా నాగం వెంట వెళ్లడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. వేణుగోపాలాచారి కూడా వారి వెంట ఉంటారని భావించారు. అయితే ఆయన వెనక్కి తగ్గి చంద్రబాబుకు తన విధేయతను ప్రకటించారు.












Click it and Unblock the Notifications