అవిశ్వాసం పెడితే జగన్ మద్దతు, ఓదార్పు యాత్రలో ప్రకటన

పేద విద్యార్థుల ఫీజుల కోసం గత ఏడాది రూ.3,400 కోట్లు, ఈ ఏడాది రూ.3,400 కోట్లు కలిపి రూ.6,800 కోట్లు బకాయిలు ఉంటే ప్రభుత్వం కేవలం 3,000 కోట్లు ఇచ్చి సరిపెడుతోందని ఆయన అన్నారు. పావలా వడ్డీ అమలుకు రూ.2,000 కోట్లు కావాల్సివస్తే కేవలం రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. ఫీజు బకాయిలకు రూ.6,800 కోట్లు, పావలా వడ్డీ అమలుకు రూ.2,000 కోట్లు వారం రోజుల్లో చెల్లించాలని, లేకపోతే అవిశ్వాసం పెడతామని ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు.
చంద్రబాబు అవిశ్వాసం పెడితే నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని జగన్ తెలిపారు. బుధవారం ఆయన విజయనగరం జిల్లా ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు. భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో పర్యటించారు. ఏడు చోట్ల వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. జగన్‌వెంట అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తదితరులు అనుసరించారు.












Click it and Unblock the Notifications