వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో చాప కింద నీరులా వైయస్ జగన్ పాగా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తెలంగాణ ప్రాంతంలో చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై గల అభిమానాన్ని ఆసరా చేసుకుంటూ పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. అంతేకాకుండా, కాంగ్రెసులోని ద్వితీయ శ్రేణి నాయకులను తన వైపు తిప్పుకుంటున్నారు. గురువారం ప్రకటించిన పార్టీ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ల ఎంపిక తీరును చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. ఇప్పటికే, కొండా సురేఖ దంపతులు (వరంగల్), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), గట్టు రామచంద్ర రావు (ఖమ్మం), గోనె ప్రకాశ రావు (ఆదిలాబాద్) వంటి తెలంగాణ నాయకులు ఆయనకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇంకా కొత్తగా మరింత మంది వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆయన అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లను నియమించారు. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి చాలా మంది ముందుకు వస్తున్నారనేది అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా నియమితుడైన ఆది శ్రీనివాస్ ఇటీవలే పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటే మరింత మంది నాయకులు ఆయన వెంట నడిచే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని స్వతంత్ర శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డి జగన్‌కు మద్దతు ప్రకటించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగన్ వెంట నడుస్తారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆర్. దామోదర్ రెడ్డి కూడా జగన్ వైపు వెళ్తారని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో వెంకటరమణా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని పలువురు కాంగ్రెసు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్ తన వైపు వచ్చే నాయకులను గుర్తించినట్లు చెబుతున్నారు.

English summary
MP YS Jagan's YSR Congress party is spreading Telangana region without fanfare. Second grade Congress leaders are ready to join YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X