చంద్రబాబు వైయస్ జగన్‌ను అదరగొట్టారా, నిజంగానే మారారా?

ఇక, తెలంగాణ విషయానికి వస్తే చంద్రబాబు ఏ విధమైన స్పష్టతా ఇవ్వలేకపోయారు. పాత విషయాలనే ఆయన వల్లె వేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తే తమ పార్టీ సీమాంధ్ర నాయకులు ఆందోళనలు చేయబోరని గానీ, పార్టీ నిర్ణయానికి వారు కట్టుబడి ఉంటారని గానీ ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్లమెంటు సభ్యులు అనుకూలంగా ఓటేస్తారని స్పష్టం చేయలేకపోయారు. అలా చెప్పకపోవడాన్ని బట్టి గత పరిణామాన్నే చంద్రబాబు పునరావృతం చేయడానికి పూనుకున్నారనేది స్పష్టమవుతూనే ఉన్నది. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నాయకులంతా దానికి కట్టుబడి ఉండాలనే కనీస ధర్మాన్ని చంద్రబాబు నాయకుల చేత పాటింపజేయలేకపోతున్నారు. అందువల్ల తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇచ్చింది ఏమీ లేదు.
స్వర్గీయ ఎన్టీ రామారావుపై తిరుగుబాటు విషయంలో కూడా ఆయన కొత్తగా చెప్పిందేమీ లేదు. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు తప్పని అంగీకరించడం మాత్రమే కొత్త మాట. తిరుగుబాటును ఆయన సమర్థించుకున్నారు. ఓ దుష్టశక్తి నుంచి పార్టీని కాపాడుకోవడానికి తిరుగుబాటు తప్పలేదని సమర్థించుకున్నారు. ఇది ఆయన మొదటి నుంచీ చేస్తున్న వాదనే. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వాన్ని ఆయన కొత్తగా ఇబ్బంది పెట్టిందేమీ లేదు. ఆయన ఎంత విరుచుకుపడినా తెలంగాణపై పూర్తి స్పష్టత ఇవ్వనంత వరకు లాభం ఉండదు. పైగా, నందమూరి కుటుంబ సభ్యుల తిరుగుబాటుకు ఆయన భయపడినట్లు కనిపించారు. నందమూరి హరికృష్ణ వ్యవహారం చంద్రబాబును ఇబ్బంది పెట్టింది. మహానాడులో నారా, నందమూరి వివాదం తెరపైకి రావడం చంద్రబాబును ఇబ్బంది పెట్టిన విషయం.












Click it and Unblock the Notifications