మహంకాళి ఫైటింగ్ చిత్రీకరణలో హీరో రాజశేఖర్‌కు తీవ్ర గాయాలు
State
oi-Srinivas G
By Srinivas
|
చెన్నై: యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్‌కు సోమవారం ప్రమాదవశాత్తూ తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలోని ఓ ప్రాంతంలో రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న మహంకాళీ చిత్రీకరణ గత మూడు నాలుగు రోజులుగా జరుగుతోంది. అయితే సోమవారం ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ రాజశేఖర్ రోడ్డుపై బోర్లా పడిపోవడంతో ఆయన కొద్ది దూరం రోడ్డుపైనే రాసుకుంటూ పోయినట్లుగా తెలుస్తోంది. దీంతో రాజశేఖర్‌కు ముఖం, ఎడమ చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఫైట్ సీన్ చిత్రం క్లైమాక్స్ సీన్‌గా తెలుస్తోంది.
వెంటనే చిత్రీకరణలో ఉన్న వారు చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజశేఖర్‌ను పరిశీలించిన వైద్యులు 15 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే మహంకాళీ చిత్రం చివరి దశలో రాజశేఖర్‌కు గాయాలు కావడంతో చిత్రం కొద్దిగా ఆలస్యం కానుంది.