జగన్ వెంట 34 మంది ఎమ్మెల్యేలు?, సమావేశానికి 22 మంది హాజరు

నిక్కచ్చిగా జగన్ వెంట నడిచే బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానికి రాలేదు. వీరిద్దరు జగన్ వెంటే ఉంటారని కచ్చితంగా చెప్పవచ్చు. ఆళ్ల నాని, జోగి రమేష్ వంటి శాసనసభ్యులు కూడా జగన్ వెంట ఉంటారని భావిస్తున్నారు. పలువురు శాసనసభ్యులతో జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ఉదయం 13 మంది శాసనసభ్యులు వచ్చారు. సాయంత్రానికి ఆ సంఖ్య 22కి పెరిగింది. స్పీకర్ ఎన్నిక విషయంలో, అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో విడివిడిగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన సంఖ్యను కూడగట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యనేతల సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి కూడా హాజరయ్యారు. ప్రస్తుత స్థితిని బట్టి అవిశ్వాస తీర్మానం రాజకీయం రసకందాయంలో పడిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications