యోగా గురు రామ్‌దేవ్ బాబాతో చర్చలు సఫలం: ఒక్క రోజే దీక్ష

దక్షిణ ఢిల్లీలోని క్లారిడ్జెస్ హోటల్లో బాబా రామ్‌దేవ్‌తో కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, సుబోధ్ కాంత్ సహాయ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. బాబా డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు చెబుతున్నారు. రెండు అంశాలపై తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని బాబా శుక్రవారం ఉదయమే చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. కేంద్ర మంత్రులు బాబాతో నిరంతరాయంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రామ్‌దేవ్ బాబా దీక్షకు సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications