స్పీకర్ నామినేషన్ ఘట్టానికి డి శ్రీనివాస్ దూరం, చిరంజీవి హాజరు

చాలా కాలంగా డిఎస్ ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ పదవుల పంపకాల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డి. శ్రీనివాస్‌ను సంప్రదించడం లేదని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పైగా, పిసిసి అధ్యక్ష పదవికి కూడా అభ్యర్థి ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డి. శ్రీనివాస్ అసంతృప్తి కారణంగా నామినేషన్ల కార్యక్రమానికి శాసనసభకు రాలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications