వారిది ఈటింగ్, మీటింగే: కాంగ్రెసు ఎంపీలపై దేవేందర్ గౌడ్ ధ్వజం

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహించనున్న తెలంగాణ రణభేరి సభను అడ్డుకోవాలని ఇచ్చిన ప్రకటనను ఉప సంహరించుకోవాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రేపు తాండూరులో నిర్వహించే సభలో విధ్వంసం సృష్టించేందుకు టీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.తాండూరు సభలో ఏ దురదృష్టకర ఘటన జరిగినా అందుకు అందుకు కేసీఆర్, కోదండరాం బాధ్యత వహించాలని ఫోరం నేతలు అన్నారు. కేసీఆర్ కుట్రలో పావులుగా మారొద్దంటూ విద్యార్థులకు, జేఏసీకి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications