బీహార్‌లో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మద్దతుగా దీక్షలు

గత ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యోగాగురు బాబా రామ్‌దేవ్(46) ఆరోగ్యం క్షీణించింది. ఆయన అపస్మారక స్థితికి వెళ్లారని రామ్‌దేవ్ సన్నిహిత అనుచరుడు స్వామి సంపూర్ణానంద వెల్లడించారు. రామ్‌దేవ్‌ను శుక్రవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆదేశాల మేరకు డెహ్రాడూన్‌లోని హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు తరలించారు. బాబా కీలక అవయవాల పనితీరు ఆందోళనకరంగా ఉందని, మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ప్రారంభమైందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఆయనకు గ్లూకోజ్ అందిస్తున్నట్లు, ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్లు జోలీ గ్రాంట్, డాక్టర్ ఎస్‌ఎల్ జెతానీ చెప్పారు.












Click it and Unblock the Notifications