పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి, పదకొండు మందికి గాయాలు
Districts
oi-Srinivas G
By Srinivas
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని రౌతులపూడి మండలం ఎన్ ఎన్ పట్టణం సమీపంలో ఓ పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి పోయి బోల్తా పడింది. దీంతో ఆ ట్రాక్టరులో ఉన్న వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో పదకొండు మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులు చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరు మరణం కారణంగా పెళ్లి బృందంలోని ఇరు కుటుంబాలతో పాటు ఆయా గ్రామాలలో తీవ్ర విషాదం నెలకొంది.