వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దీక్ష విరమించిన రామ్‌దేవ్, ఫలించిన శ్రీశ్రీ రవిశంకర్ దౌత్యం

వివిధ ఆధ్యాత్మిక, మత నాయకుల సమక్షంలో రామ్‌దేవ్ బాబా దీక్ష విరమించినట్లు రవిశంకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. బాబా రామ్‌దేవ్ దీక్ష విరమించారని, కానీ పోరాటాన్ని ఆపలేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రామ్‌దేవ్ ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన చెప్పారు.
ఆదివారం ఉదయం బాబా రామ్‌దేవ్‌ను హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కలిశారు. మత నాయుడు మొరారీ బాపు కూడా రామ్‌దేవ్‌ను పరామర్శించి, దీక్షను విరమించాలని సూచించారు.